వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. పరిస్థితి ఉద్రిక్తం
నంద్యాల జిల్లాలో దారుణ హత్య జరిగింది. వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు;
నంద్యాల జిల్లాలో దారుణ హత్య జరిగింది. వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైైసీపీ కార్యకర్త సుబ్బరాయుడిని ఇంట్లోకి చొరబడి కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్య చేసింది టీడీపీ నేతలేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సుబ్బరాయుడి ఇంటికి వచ్చిన దుండగులు వారి కుటుంబంతో ఘర్షణకు దిగారు.
అర్ధరాత్రి ఇంట్లో చొరబడి...
అయితే ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో దుండగులు కర్రలు, రాళ్లతో సుబ్బరాయుడిపై దాడి చేశారు. దీంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మరణించారు. దాడిని అడ్డుకోపోయిన సుబ్బరాయుడి భార్య బాలసుబ్బమ్మకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలే బరితెగించి పోలీసుల ఎదుటే హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.