యూట్యూబ్ లో చూసి సొంతంగా కాన్పు.. ఆ తర్వాత బిడ్డను ఏం చేసిందంటే..

ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో..

Update: 2023-03-06 04:27 GMT

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాని వల్ల కలిగే ఉపయోగాలకంటే అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్ లు ఇలా చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం హద్దులు మీరింది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.

బాలిక పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించగా.. అది అనారోగ్యం వల్ల పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. ఇంట్లోనే ఉన్న ఓ పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తిరిగి ఇంటికెళ్లిన తల్లికి కుమార్తె నీరసంగా కనిపించడంతో.. కాస్త గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News