నెల్లూరు జిల్లా.. కన్న కూతుళ్ళనే చంపబోయిన తండ్రి

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన. వేణుగోపాల్,యామినిలకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

Update: 2022-06-15 13:25 GMT

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పేరారెడ్డిపల్లెలో దారుణం జరిగింది. శాంతి పూజల పేరుతో కన్న పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి ప్రయత్నించాడు. పూర్విక, పునర్విక అనే కవల పిల్లలను తండ్రి వేణు గదిలోకి తీసుకెళ్లి పూజులు చేశాడు. ఆ తర్వాత పునర్విక గొంతు నులమడంతో పూర్విక భయపడి కేకలు వేస్తూ బయటకు వచ్చింది. దీంతో స్థానికలు ఇంట్లోకి వెళ్లి చూడగా వేణు క్షుద్రపూజులు చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే పునర్విక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను స్థానికలు సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన. వేణుగోపాల్,యామినిలకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. పెళ్లైన పదేళ్ల తర్వాత వీరు పుట్టడంతో పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేవారు. అయితే గత మూడు రోజులుగా చుట్టుపక్కల వారికి ఎవరికీ తెలియకుండా తన ఇంట్లో వేణు శాంతి పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే అవి క్షుద్రపూజలని తర్వాత తెలిసింది. పూజలో కూర్చున్న వేణు తన కాళ్ళ మీద తన రెండవ కూతురు పునర్వికను పడుకో పెట్టి నోట్లో కుంకుమ పోశాడు. ఆమె గొంతు నులమడంతో.. పెద్ద పాప పూర్విక పెద్దగా ఏడుస్తూ బయటికి పరుగులు తీసింది. ఇది గమనించిన మేనమామ చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వెంటనే వేణు దగ్గర ఉన్న పాపను తీసుకుని వచ్చేశాడు. పాపను రక్షించి ప్రాథమిక చికిత్స కోసం ఆత్మకూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేణుని అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News