బెజవాడలో కుటుంబ ఆత్మహత్య కేసులో.. ఆ ఇద్దరూ?
విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కేసుల్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది
విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కేసుల్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్లే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఫైనాన్షియర్ల వేధింపులతోనే తాము ఆత్మహ్యకు పాల్పడుతున్నట్లు ఆత్మహత్య చేసుకునే ముందు సురేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఫైనాన్షియర్లకు ఎంత వడ్డీ రూపంలో చెల్లించినా తమకు వేధింపులు ఆగలేదని సురేష్ పేర్కొన్నారు.
సెల్ఫీ వీడియోతో...
ీఈ సెల్ఫీ వీడియోను సురేష్ బంధువులు పోలీసులకు ఇచ్చారు. ఫైనాన్షియర్ జ్ఞానేశ్వర్ తనను వేధించాడని, నలభై లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించినా వేధింపులు ఆపలేదని తెలిపారు. అలాగే మరో వడ్డీ వ్యాపారి గణేష్ కు 80 లక్షలు చెల్లించానని, అయినా వేధింపులు ఆగకపోవడం వల్లనే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నామని సురేష్ తెలిపారు. తమ కుటుంబ సభ్యుల చేత ఖాళీ ప్రామిసరీ నోట్లు, కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. దీంతో పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.