Breaking: దొంగని వదిలేసి మీడియాకి సూక్తులు చెప్తున్న పోలీసులు
దొంగను చెరువు నుంచి బయటకు వచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారుల
హైదరాబాద్‌లో ఓ దొంగ పోలీసులను రాత్రంతా మేలుకునేలా చేశాడు. సూరారంలో తాళం వేసిన ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయి చెరువులోని బండపై తిష్ట వేశాడు. పోలీసులు ఎంత పిలిచినా దొంగ బయటకు రాలేదు. చివరికి పోలీసుల కనుగప్పి దొంగ పరారయ్యాడు. అయితే పోలీసులు దొంగను పట్టుకోగపోగా వాళ్లు చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించకమానవు.
దొంగను చెరువు నుంచి బయటకు వచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారుల ప్రయత్నాలై ఫలించకపోవడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, అతడిని పట్టుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. సూరారం ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అతడిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాం.. సరస్సులో డ్రైనేజీ నీళ్లతో నిండిపోవడంతో మా మనుషులు అందులోకి వెళ్లలేకపోయారు. "దొంగ ఈదుకుంటూ లాల్ సాబ్ గూడ అడవిలోకి ప్రవేశించి ఉంటాడని మేము అనుమానిస్తున్నాము. అతన్ని కనుగొనడానికి మేము అడవిలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాలి. లేదా దొంగ చెరువులో మునిగిపోయి ఉండవచ్చు." అని చెప్పుకొచ్చారు. అతడేమీ చార్లెస్ శోభరాజ్ కాదని.. మీడియా అతడిపై అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.