Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ఇంకెంత మందో?

తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు

Update: 2024-03-29 05:33 GMT

తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు. నిన్న మాజి డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపపథ్యంలో ఇంకెంత మంది ఈ కేసులో అరెస్ట్ అవుతారోనన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుంది. మరికాసేపట్లో రాధాకిషన్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు. టాస్క్ ఫోర్స్ , ఎస్.ఐ.బి సిబ్బంది విచారణకు హాజరవుతున్నారు.

ఇప్పటికే...
నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్ ను పోలీసులు ఇప్పటికే ఈ కేసులో విచారించారు. నిన్న వీరి స్టేట్‌మెంట్ రికార్డును చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాదాకిషన్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగ రావ్ లను కూడా కస్టడీ కి తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్ , సీజ్ చేసిన డబ్బులు, నేతల తో సంభాషణల పై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News