నిజామాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కోణంలో ఈ సోదాలు నిర్వహిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కోణంలో ఈ సోదాలు నిర్వహిస్తుంది. నిజామాబాద్, కర్నూలు, కడప, గుంటూరు జిల్లాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధనలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. కరాటే శిక్షణ లీగల్ అవేర్‌నెస్ పేరిట పీఎఫ్ఐ కార్యకలాపాలు సాగుతున్నాయని ఎన్ఐఏ అనుమానించి ఈ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం నాలుగు బృందాలతో ఈ తనిఖీలను ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్నారు.
గతంలోనూ....
గతంలో పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. విదేశాల నుంచి నగదు బదిలీ, బ్యాంకు ఖాతాల్లో అనుమానిత లావాదేవీలను గుర్తించిన ఎన్ఐఏ ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భైంసా అలర్ల నేపథ్యంలోనూ ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోధన్ లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.