అప్పులభారంతోనే బెజవాడలో ఆత్మహత్య ?
నిజామాబాద్ లోని గంగస్థాన్ కాలనీలో నివసించే పప్పుల సురేష్, అతని భార్య శ్రీలత, కుమారులు అఖిల్, ఆశిష్ లు శనివారం తెల్లవారుజామున బెజవాడలో
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ ఫ్యామిలీ ఈరోజు తెల్లవారుజామున విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అప్పుల భారంతోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నిజామాబాద్ లోని గంగస్థాన్ కాలనీలో నివసించే పప్పుల సురేష్, అతని భార్య శ్రీలత, కుమారులు అఖిల్, ఆశిష్ లు శనివారం తెల్లవారుజామున బెజవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పప్పుల సురేష్ గతంలో మెడికల్ రంగంలో పనిచేసి.. ఆర్థికంగా నష్టాలు రావడంతో ఇటీవలే చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.
Also Read : లైంగిక వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
సురేష్ పెద్దకొడుకైన అఖిల్ నిజామాబాద్ లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. చిట్టీల వ్యాపారం, కుటుంబ పోషణకు చేసిన అప్పులు పెరగిపోయాయి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, బ్యాంకలు ఇలా చేసిన అప్పులు కోటి రూపాయల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. మూడ్రోజులుగా సురేష్ కుటుంబం కనిపించకపోవడంతో.. అప్పులిచ్చినవారు తరచూ అపార్ట్ మెంట్ కు వచ్చివెళ్తున్నట్లు ఇరుగుపొరుగువారు చెప్తున్నారు. ఇదిలా ఉండగా అప్పులిచ్చిన బ్యాంకర్లు ఇదివరకే ఇంటికి నోటీసులు అంటించి వెళ్లినట్లు తెలుస్తోంది.