మంత్రిపై కాల్పులు : పరిస్థితి విషమం
ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నవకిషోర్ దాస్ పై దుండగులు కాల్పులు జరిపారు.
ఒడిశాలో ఘోరం జరిగింది. మంత్రిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రితో పాటు ఆయన అనుచరులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నవకిషోర్ దాస్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన పర్యటనలో ఉండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఆసుపత్రికి తరలింపిు...
అయితే దాడిలో మంత్రి తీవ్రంగా గాయపడటంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మంత్రిపై కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి వెదుకులాటను ప్రారంభించారు. ఎందుకు కాల్పులు జరిపారన్న కారణాలు ఇంకా తెలియరాలేదు.