మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

జిల్లాలోని వేల్పూర్ లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవేందర్ (19) అనే ఆఫీస్ బాయ్ ఉరివేసుకుని బలవన్మరణానికి..

Update: 2022-08-28 11:25 GMT

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్ శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జిల్లాలోని వేల్పూర్ లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవేందర్ (19) అనే ఆఫీస్ బాయ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్యాంపు కార్యాలయంలోని ఓ గదిలో దేవేందర్ ఉరివేసుకుని ఉన్న స్థితిలో గుర్తించారు. స్థానికులు దేవేందర్ ను కిందికి దించి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గం మధ్యలోనే అతను మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న ఆర్మూరు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దేవేందర్ ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. ఆత్మహత్యకు ముందు అతను ఆమెకు ఓ మెసేజ్ పంపినట్లు గుర్తించామన్నారు. కాగా.. దేవేందర్ తన వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. దేవేందర్ ఆత్మహత్యపై పూర్తిగా దర్యాప్తు చేసి, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు.


Tags:    

Similar News