పూణె-బెంగళూరు హైవే పై ఆయిల్ ట్యాంకర్ బీభత్సం

ప్రమాదంపై సమాచారం అందుకున్న పూణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి..

Update: 2022-11-21 03:59 GMT

pune-banglore highway accident

పూణె- బెంగళూరు హైవే పై ఓ ఆయిల్ ట్యాంకర్ తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పూణె నవ్ లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ఆయిల్ ట్యాంకర్ లారీ.. ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో 48 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొని.. ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలవ్వగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పూణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్యాంకర్లోని ఆయిల్ రోడ్డుపై పడటంతో.. మిగతా వాహనాల టైర్లు జారి ఒకదానినొకటి ఢీ కొన్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. కార్లు వాటి ముందున్న కంటైనర్ల కిందకి చొచ్చుకుపోయి.. నుజ్జునుజ్జయ్యాయి. ఆ సమయంలో అక్కడున్న వారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలను తీసి.. నెట్టింట్లో పోస్ట్ చేశారు.


Tags:    

Similar News