స్వీట్ షాపులో పేలిన గ్యాస్ సిలిండర్లు.. పెళ్లివేడుకల్లో విషాదం
పేలుడు ధాటికి మంటలు వ్యాపించడంతో.. ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో విషాదం నెలకొంది. మంటలను
ఎంతో సంతోషంగా, సరదాగా సాగిపోతున్న పెళ్లివేడుకలో సిలిండర్ల పేలుళ్లు తీవ్రవిషాదాన్ని నింపాయి. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లా షేర్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిందీ ఘటన. భుంగ్రా గ్రామంలో ఓ వివాహ వేడుక జరుగుతుండగా.. పక్కనే ఉన్న స్వీట్ షాపులో ఏకంగా 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో 60 మంది తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో 50 మంది పెళ్లికొచ్చిన అతిథులే ఉన్నారు. సిలిండర్ పేలుడుతో పెళ్లి వేడుకలో గందరగోళ వాతావరణం నెలకొంది.
పేలుడు ధాటికి మంటలు వ్యాపించడంతో.. ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో విషాదం నెలకొంది. మంటలను అదుపుచేసిన గ్రామస్తులు.. ఆ మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చి.. ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ హిమన్షు గుప్తా, రూరల్ ఎస్పీ అనిల్ కయల్ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు బోధ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మరోవైపు షేర్‌గఢ్ తహసీల్ ఆసుపత్రిలో 18 మందికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘోరప్రమాదంలో చికిత్సపొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.