Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2024-04-17 12:05 GMT

drugs in hyderabad

హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ లో వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి నుంచి 4.2 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ పోలీసులు ఈ డ్రగ్స్ ను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాజమండ్రి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బెంగళూరులో ఒక నైజీరియన్ నుంచి ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని...
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు శ్యాంబాబు, సూర్యకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారు డ్రగ్స్ దందాచేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడయింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News