నకిలీ సీబీఐ అధికారులు అరెస్ట్

సీబీఐ అధికారులమంటూ గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలోకి చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు

Update: 2021-12-16 04:15 GMT

నకిలీ సీబీఐ అధికారులు నగరంలో హల్ చల్ చేస్తున్నారు. సీబీఐ అధికారులమంటూ గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలోకి చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఐడీ కార్డులు సృష్టించారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద ఇటీవల సీబీఐ అధికారులమంటూ బంగారం, నగదు దోచుకోళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందనిన వారిగా గుర్తించారు.

యజమానికే....
సుబ్రమణ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన దగ్గర పనిచేసే జస్వంత్ అనే వ్యక్తి ఈ దోపిడీకి పథకరచన చేసినట్లు తెలిసింది. యజమాని దగ్గర పెద్దయెత్తున నగదు, బంగారం ఉందని తెలుసుకున్న జస్వంత్ మరికొందరు స్నేహితులతో కలసి ఈ ప్లాన్ చేశారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News