హైదరాబాద్ లో 300 తాగుబోతులపై కేసులు
జంటనగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది పై కేసులు నమోదు చేశారు.
జంటనగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది పై కేసులు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. దీంతో హైదరాబాద్ లోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది తాగుబోతులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
నలుగురి మృతికి...
హైదరాబాద్ లో మొత్తం 124 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించారు. నిన్న మద్యం మత్తులో వాహనం నడిపి జరిపిన ప్రమాదంలో నలుగురు వేర్వేరు ఘటనల్లో మృతి చెందారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నారు. వీకెండ్ లో మరింత ఎక్కవ చోట్ల నిర్వహించాలని నిర్ణయించారు.