బాధిత బాలిక వివరాలు బయటకు.. పోక్సో యాక్ట్ కింద కేసు
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు చాలా గోప్యంగా ఉంచాలి
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన ఓ తెలుగు దినపత్రిక యాజమాన్యంతో పాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. లైంగికదాడి ఘటనలో వివరాలు బయటపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులపై ఐపీసీ 228 (ఏ), 23 (2)ఆఫ్ పోక్సో యాక్ట్, 74 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
గోప్యంగా ఉంచాల్సిందే:
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు చాలా గోప్యంగా ఉంచాలి. అలాంటిది వార్తా కథనంలో బాధితుల పేర్లను, వివరాలను బయట పెడితే చర్యలు తీసుకోకతప్పదు. అలా బాధిత బాలిక వివరాలు ప్రచురించిన ఓ దినపత్రిక యాజమాన్యం, రిపోర్టర్పై ఫిలింనగర్ పీఎస్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. లైంగికదాడి ఘటనలో వివరాలు బయటపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.