జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో...?

జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు వేగవంతం చేశారు.. బాలిక స్టేట్‌మెంట్ ను మరోసారి తీసుకున్నారు.

Update: 2022-06-06 12:08 GMT

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు వేగవంతం చేశారు.. బాలిక స్టేట్‌మెంట్ ను మరోసారి తీసుకున్నారు. బాలిక తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించింది. కారులో తనపై నలుగురు అసభ్యకరంగా ప్రవర్తించారని బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో పేర్కొంది. కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లను, వెంట్రుకలను ఎఫ్ఎస్‌లకు పంపారు.

మరోసారి స్టేట్‌మెంట్...
దీనిపై మరోసారి లీగల్ ఒపీనియన్ పోలీసులు తీసుకోనున్నారు. కారులో ఎమ్మెల్యే కుమారుడి పేరును ఆరో నిందితుడిగా చేర్చనున్నారు. బాధితురాలితో పాటు తల్లిదండ్రుల స్టేట్‌మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొందరు పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశముంది.


Tags:    

Similar News