మహిళను ఎస్ఐ లాఠీతో కొట్టి?

హైదరాబాద్ లో మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీస్తున్నా

Update: 2022-02-19 02:48 GMT

హైదరాబాద్ లో పోలీసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. సైఫా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ సూరజ్, ఒక కానిస్టేబుల్ ముస్లిం మహిళ పట్ల అనుచితం వ్యవహరించారు. చిన్న రోడ్డు ప్రమాదం కేసులో ఆమె పై లాఠీని ఝళిపించారు.

మైనర్ యాక్సిడెంట్....
ముస్లిం మహిళలు ప్రయాణిస్తున్న కారు అటుగా వెళుతున్న బస్సుకు తాకింది. అయితే ఇది మైనర్ యాక్సిడెంట్ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా బస్సు డ్రైవర్ తో జరిగిన వాగ్వాదం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడకు చేరుకున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ముస్లిం మహిళను లాఠీతో కొట్టారు. దీనిపై ఆ మహిళ ఎస్ఐ, కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News