బీర్ తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన మాస్టార్

టీచర్ ను నిలదీసేందుకు స్కూల్ కి వెళ్లారు. క్లాస్ రూమ్ లో ఉన్న స్టూల్ కింద ఖాళీ చేసిన ఒక బీరు క్యాన్‌ కనిపించింది.

Update: 2022-10-03 00:00 GMT

Teacher Drinking Beer In Classroom 

ఉత్తరప్రదేశ్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యార్థులకు మంచి పాఠాలతో.. మంచి బుద్ధులను నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ ఘటన హత్రాస్ లోని ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు తన వెంట బీర్ క్యాన్లను క్లాస్ రూమ్ కి తెచ్చుకున్నాడు. బీర్ తాగుతూనే విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. అతని పక్కనే మరో కుర్చీలో ఉన్న మహిళా టీచర్ కూడా పాఠాలు చెబుతోంది.

ఈ విషయం స్థానికులకు తెలియడంతో.. టీచర్ ను నిలదీసేందుకు స్కూల్ కి వెళ్లారు. క్లాస్ రూమ్ లో ఉన్న స్టూల్ కింద ఖాళీ చేసిన ఒక బీరు క్యాన్‌ కనిపించింది. ఆ ఉపాధ్యాయుడి వద్ద ఓపెన్‌ చేయని మరో బీర్‌ క్యాన్ కూడా ఉంది. దానిని తన వెనుక దాచేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో క్లాసులో విద్యార్థుల ముందు బీరు తాగుతున్న టీచర్‌ను స్థానికులు నిలదీశారు. హత్రాస్ జిల్లా విద్యాశాఖ దృష్టికిి ఈ విషయం వెళ్లగా.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా..అది కాస్తా వైరల్ అవుతోంది. విపరీతంగా తాగిన ఆ టీచర్ అమ్మాయిలకు పాఠాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వారు ఇలా ప్రవర్తిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? అని ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను కోరారామె.





Tags:    

Similar News