భార్య, మేనల్లుడిని చంపి.. ఏసీపీ ఆత్మహత్య
కాల్పుల శబ్ధం విని పక్క గదిలోనే ఉన్న కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చారు. తలుపు తెరిచి చూసిన మేనల్లుడు దీపక్ (35) పై
ఏసీపీ తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి.. అనంతం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రావతి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్(57) బానర్ ప్రాంతంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. సోమవారం (జులై24) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అధికారి తన తుపాకీతో మొదట భార్య మోనీ గైక్వాడ్ (44)పై కాల్పులు జరిపాడు.
కాల్పుల శబ్ధం విని పక్క గదిలోనే ఉన్న కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చారు. తలుపు తెరిచి చూసిన మేనల్లుడు దీపక్ (35) పై కూడా కాల్పులు జరపడంతో.. అతనికి ఛాతీపై బుల్లెట్ గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ కొడుకు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ భరత్ గైక్వాడ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.