ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది మృతి

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఇరవై ఆరు మంది అకకడికక్కడే మరణించారు

Update: 2024-07-17 01:54 GMT

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఇరవై ఆరు మంది అకకడికక్కడే మరణించారు. మరో పథ్నాలుగు మంది గాయాలతో బయటపడ్డారు. దక్షిణ అమెరికా దేశం పెరూలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని లిమా నుంచి నలభై మంది ప్రయాణికులతో బస్సు ఆండియన్ కు బయలుదేరింది.

అతి వేగం వల్లనే...
బస్సు ప్రయాణిస్తూ అదుపు తప్పి వేగంగా లోయలోకి పడింది. దాదాపు రెండు వందల మీటర్ల లోతులో బస్సు పడటంతో ఇంత పెద్ద స్థాయిలో మృతుల సంఖ్య చేరిందని అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా గుర్తించారు. ఈ దుర్ఘటనతో అనేక మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది.


Tags:    

Similar News