ప్రకాశం జిల్లా ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద కారు-ఆటో ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 10మందికి గాయాలవ్వగా..

Update: 2022-03-24 12:13 GMT

యర్రగొండపాలెం : ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద కారు-ఆటో ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 10మందికి గాయాలవ్వగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో చనిపోయిన వారంతా మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిర్చికోతకు వెళ్లిన కూలీలు తిరిగి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News