Road Accident : డ్రైవర్ నిద్రమత్తు.. కారు బోల్తా ...ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు;
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం వద్ద అదుపు తప్పి కారు బోల్లా కొట్టింది. కారులో వీరు భద్రాచలంలో ఒక వివాహానికి హాజరై వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరణించిన వారు...
ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారని, వీరంతా కందుకూరు పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల పేర్లు రాయని అరుణ, గుళ్లాపల్లి శ్రావణి, తల్లపనేని దివ్యగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.