పుష్ప తరహాలో.. గాజుల మాటున గంజాయి స్మగ్లింగ్

మహారాష్ట్ర కు చెందిన విజయ్ ఆసారమ్, ప్రదీప్, సత్యనారాయణ, సవిత్రా సత్యనారాయణ, దాదా రావు తో పాటు జయ అనే మహిళ..

Update: 2023-07-21 04:48 GMT

odisha to maharastra ganjai smuggling

గంజాయి సరఫరా చేసే స్మగ్లర్ల పై పుష్ప సినిమా ప్రభావం బాగా పడింది... పుష్ప సినిమాలోని హీరో తరహాలో కొత్త కొత్త పద్ధతుల్లో పోలీసుల కంట పడకుండా గంజాయిని ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ మీదుగా మరో రాష్ట్రానికి దర్జాగా తరలిస్తున్నారు. ఓ ముఠా గాజుల మటన్ గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహారాష్ట్ర కు చెందిన విజయ్ ఆసారమ్, ప్రదీప్, సత్యనారాయణ, సవిత్రా సత్యనారాయణ, దాదా రావు తో పాటు జయ అనే మహిళ ఈ ఆరుగురు కలిసి సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి ఒడిసా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసుకుని పోలీసుల చేతికి చిక్కకుండా ఆ గంజాయిని బుట్టలో పెట్టుకుని దానిపై గాజులన్నీ పెట్టి దర్జాగా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు గంజాయి స్మగ్లింగ్ పై విశ్వసనీయమైన సమాచారం రావడంతో అత్తాపూర్లో మాటు వేసి ఉన్నారు.

గంజాయి తో రాజేంద్రనగర్ కు చేరుకున్న మహారాష్ట్ర కు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుండి 4 మొబైల్స్, రూ.22 లక్షల విలువ చేసే గంజాయి, ఆరు సెల్ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేసే ముఠాలో ఒక మహిళ కూడా ఉండటాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. గంజాయి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో‌ ముగ్గురు పరారీలో ఉన్నారు. గాజుల మాటున గంజాయిని పెట్టుకుని రహస్యంగా ఒడిసా నుంచి వయా హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 115 కేజీల గంజాయిని సైబరాబాద్ ఎస్ఓటీ బృందం పట్టుకున్నారు. మహారాష్ట్ర కు చెందిన విజయ్ ఆసారమ్, ప్రదీప్, సత్యనారాయణ, సవిత్రా సత్యనారాయణ, దాదారావు తో పాటు జయ అనే మహిళ ను పోలీసులు అరెస్ట్ చేసి ఆరుగురి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఒడిసా కు చెందిన అవస్కార్, మహారాష్ట్ర కు చెందిన క్రూనల్ దోరా, ప్రదీప్ లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News