స్కూల్ బస్సు వెళ్లి వ్యవసాయ భూముల్లో పడింది.. డ్రైవర్ పరారీ

మహబూబ్ నగర్ జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన విద్యార్థులను

Update: 2023-08-02 12:29 GMT

మహబూబ్ నగర్ జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకుని వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బుధవారం తొర్రూరు పట్టణం శ్రీ నలంద పాఠశాలకు చెందిన బస్సు స్కూల్ కు వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ అతివేగంతో వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తొర్రూరులోని నలంద ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సు బుధవారం దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం నుంచి విద్యార్థులతో బయల్దేరింది. పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాపల్లికి చెందిన సుమారు 42 మంది విద్యార్థులతో బొడ్లాడ గ్రామానికి వెళ్తోంది. ఈ క్రమంలో బొడ్లాడ శివారులో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లి బోల్తా పడింది. వెంటనే బస్సులోకి విద్యార్థులను సమీపంలోని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ అతివేగంతో బస్సును నడుపుతున్నాడని గతంలో ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


Tags:    

Similar News