బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని దత్‌పుకూర్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని దత్‌పుకూర్ ప్రాంతంలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం జరిగిన పేలుడులో ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోల్‌కతాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలోని దత్తపుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌లోని మోష్‌పోల్‌లోని ఫ్యాక్టరీలో పలువురు వ్యక్తులు పనిచేస్తుండగా ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు తీవ్రత చాలా బలంగా ఉండడంతో.. ఆ ప్రాంతంలోని పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. బాణసంచా ఫ్యాక్టరీకి అనుమతులు లేవని చెబుతున్నారు.
పేలుడు ఘటనపై ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆశిష్ ఘోష్ మాట్లాడుతూ ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. ఈ పేలుడులో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు మే నెలలో కూడా తూర్పు మేదినీపూర్ జిల్లాలోని ఎగ్రాలో అక్రమ బాణసంచా కర్మాగారంలో ఇలాంటి పేలుడే సంభవించింది. ఆ ఘటనలో 12 మంది మరణించారు.