హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న శివారెడ్డి
శివారెడ్డి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.;
హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఏపీలోని కడప జిల్లాకు చెందిన న్యాయవాది శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టులోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గన్‌తో కాల్చుకున్న శివారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
శివారెడ్డి అనే న్యాయవాది గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇయన స్వగ్రామం కడపగా తెలుస్తోంది. తన లైసెన్స్ రివాల్వర్‌తో శివారెడ్డి కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.