కొడుకు ఫెయిల్ అయ్యాడని.. తల్లి ఊహించని నిర్ణయం

సీఏ పరీక్షలో కుమారుడు ఫెయిలయ్యాడని ఓ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది

Update: 2023-08-10 03:16 GMT

సీఏ పరీక్షలో కుమారుడు ఫెయిలయ్యాడని ఓ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివసించే నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగభూషణం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఇటీవల వారి కుమారుడు ఒకరు చార్టర్డె అకౌంటెన్సీ పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత పుష్పజ్యోతి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. కుమారుడి భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న ఆమె బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికే ఆమె మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజుల రామారంలోని బాలాజీ ఎన్​క్లేవ్​కు చెందిన పుష్ప జ్యోతి(41) కొడుకు ఇటీవల వచ్చిన సీఏ ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న పుష్ప జ్యోతి మంగళవారం రాత్రి బెడ్రూంలో ఫ్యాన్ కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News