దిశ ఎన్ కౌంటర్ పై కమిషన్ సంఘటన స్థలిలో...?
దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంఘటన స్థలిని పరిశీలించింది.
దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంఘటన స్థలిని పరిశీలించింది. షాద్ నగర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూసింది. కమిషన్ సభ్యులు భారీ భద్రత మధ్య సంఘటన స్థలికి చేరకున్నారు. 2019 డిసెంబరు 6వ తేదీన చటాన్ పల్లిలో నలుగురు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కమిషన్ ను ఏర్పాటు చేసింది.
దహనం చేసిన...
దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని కూడా కమిషన్ బృందం పరిశీలించింది. కమిషన్ సభ్యుల పర్యటనకు కేంద్ర బలగాలతో భద్రతను కల్పించారు. క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను కమిషన్ బృందం పరిశీలించనుంది. కొన్ని ప్రజా సంఘాలు కమిషన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.