బస్సును ఢీ కొట్టిన బొలెరో.. ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు

ఖుషీనగర్ లోని కోహ్రా గ్రామానికి చెందిన ప్రయాణికులు బొలెరో వాహనంలో తిలక్ కార్యక్రమానికి హాజరై.. తిరిగి డియోరియా..

Update: 2022-04-19 11:04 GMT

డియోరియో : యూపీ రోడ్ వేస్ కు చెందిన కాంట్రాక్ట్ బస్సును వేగంగా వచ్చిన బొలెరో ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం యూపీలోని డియోరియాలో జరిగింది. ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడగా.. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రెండు వాహనాలు బోల్తా పడటంతో.. చాలా మంది వాహనాల్లో చిక్కుకుపోగా.. వారిని బయటికి తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఖుషీనగర్ లోని కోహ్రా గ్రామానికి చెందిన ప్రయాణికులు బొలెరో వాహనంలో తిలక్ కార్యక్రమానికి హాజరై.. తిరిగి డియోరియాకు వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనాహా గ్రామసమీపంలో గోరఖ్ పూర్ నుంచి వస్తున్న బస్సును బొలెరో ఢీ కొట్టడంతో రెండు వాహనాలూ బోల్తా పడ్డాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గ్యాస్ కట్టర్ యంత్రాల సహాయంతో బొలెరో, బస్సును కట్ చేసి వాటి కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులకు సమీపంలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టమ్ కు తరలించారు.


Tags:    

Similar News