నటి సౌమ్యశెట్టి.. బంగారం దొంగగా మారింది

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి సౌమ్యశెట్టిని పోలీసులు అరెస్టు చేశారు;

Update: 2024-03-03 14:57 GMT

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి సౌమ్యశెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి జనపాల్ ప్రసాద్ బాబు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. సౌమ్యశెట్టి ఏకంగా కిలో బంగారం దోచుకున్నట్లు సమాచారం. విశాఖపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య నాలుగు వేర్వేరు సందర్భాల్లో చోరీకి పాల్పడి ఆ తర్వాత దొంగిలించిన బంగారంతో గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసింది. ఆమె దొంగిలించిన నగలను విక్రయించింది.. గోవాలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లను చేస్తూ ఉండేది. ఈ కేసును విచారించిన విశాఖ క్రైం పోలీసులు రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడింది మరెవరో కాదని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్యశెట్టి అని తేల్చారు. సౌమ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ మొదలైన కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

గోవాలో అరెస్ట్:
విశాఖపట్నంలో ప్రసాద్ అనే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి సౌమ్య నివసిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి రీల్స్ చేస్తుంటుంది. ప్రసాద్ కుమార్తెతో సౌమ్య శెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. తనను తాను ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ గా చెప్పుకుని ఆ అమ్మాయితో స్నేహం చేసింది. సౌమ్య శెట్టి తరచుగా ప్రసాద్ ఇంటికి వెళ్లి వచ్చేది. ఒక రోజు ప్రసాద్ ఇంట్లో కిలో బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. అప్పటినుంచి సౌమ్య శెట్టి వారి ఇంటికి రావడం మానేసింది. ప్రసాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సౌమ్య మీద అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సౌమ్యశెట్టి గోవాలో ఉన్నట్టు తేలింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న విశాఖ పోలీసులు గోవా పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకుని వచ్చారు.


Tags:    

Similar News