సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

గౌలిదొడ్డిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వ్యక్తిగత కారణాలతోనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు..

Update: 2022-02-22 08:26 GMT

హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం.. స్థానికంగా కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వ్యక్తిగత కారణాలతోనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన స్మృతి రేఖా ఫరీదా (26) అనే యువతి గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గౌలిదొడ్డిలోని పీజీ హాస్టల్లో రేఖ ఉంటోంది. సోమవారం తన సహోద్యోగి జాన్ కు ఫోన్ చేసిన రేఖ.. తనకు ఇంకా బతకాలని లేదని బాధపడుతూ చెప్పింది. ఆ తర్వాత తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు.. హాస్టల్ లో రేఖ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని, యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా.. రేఖా ఫరీదాను కొంతకాలంగా ఎవరో వేధిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యువతి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ తదితర వివరాలను సేకరించి, విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News