తిరుమలలో ఘరానా మోసం.. ప్రత్యేక దర్శనం టికెట్లని నమ్మించి !

కొద్దిరోజులుగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మార్చి 30వ తేదీన అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన కొందరు..

Update: 2022-04-07 09:42 GMT

తిరుపతి : తిరుమలలో దళారీలు సంపాదనే ధ్యేయంగా భక్తులను మోసం చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో దళారీలు మోసాలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా.. స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లని చెప్పి..సర్వదర్శన టికెట్లను రూ.300కు భక్తులకు అంటగట్టిన ఘటన తిరుమలలో వెలుగుచూసింది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం టిటిడి తిరుమలలో ఉచిత సర్వదర్శన సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

కొద్దిరోజులుగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మార్చి 30వ తేదీన అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. సర్వదర్శనం ఆలస్యమవుతుందని భావించి శీఘ్రదర్శనార్థం టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు. దళారీ కిరణ్ కుమార్ తన బుద్ధి చూపించాడు. సర్వదర్శన టోకెన్లు ఇప్పించి.. వాటినే రూ.300విలువైన శీఘ్రదర్శన టోకెన్లని నమ్మించాడు. ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్.
ఆ టికెట్లు తీసుకుని దర్శనానికి వెళ్తున్న భక్తులను సిబ్బంది అడ్డుకున్నారు. అవి సర్వదర్శనం టోకెన్లని చెప్పడంతో తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే టిటిడి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై తిరుపతి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News