రచయిత అనుమానాస్పద మృతి
అతని గది నిండా కథలు ఉన్నాయి. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో
సినిమా ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఎంతో మంది రచయితలు అవుదామని, దర్శకులు అవుదామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరూ అనుకున్నట్లే జరగవు. కొందరికి నిరాశ.. నిస్పృహలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న సమయానికి తాము అనుకున్నది అవ్వలేకపోయామని బాధపడే వాళ్లు చాలా మందే ఉంటారు. ఎప్పుడో ఒక సమయంలో అవకాశం రాకపోదా అని ఎదురుచూసే వాళ్లు కూడా ఉంటారు. అందరూ రిజెక్షన్ ను ఒకేలా తీసుకోరు. కొందరు ఊహించని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన వ్యక్తే కీర్తి సాగర్.
కథా రచయిత కీర్తి సాగర్ అవకాశాల కోసం సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగాడు. వందలాది కథలు రాసి అవకాశాల కోసం ఎదురు చూశాడు. అయితే తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదన్న బాధతో కీర్తి సాగర్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. చివరికి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని గది నిండా కథలు ఉన్నాయి. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో పోలీసులు మార్చురీలో ఉంచారు. ఫిలిమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అతడి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.