చిందిన రక్తం.. రోడ్డుపై కత్తులు, కొడవళ్లతో భీభత్సం
ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్ లో రోడ్డు మీద చిన్నపాటి యుద్ధమే
ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్ లో రోడ్డు మీద చిన్నపాటి యుద్ధమే జరిగింది. భువనేశ్వర్‌లోని ఖండగిరి పోలీస్ పరిధిలోని జగ్ మారా వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో రెండు వర్గాలు మారణాయుధాలతో దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు కత్తులు, కొడవళ్లతో దాడి చేసుకోవడంతో రహదారిపై యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు మరియు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
భువనేశ్వర్‌లోని పండారా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు మంగళవారం రాత్రి జగ్ మారా వద్ద ఒక ఫుడ్ స్టాల్‌కి వచ్చారు. ఇంతలో ఓ గుంపు అకస్మాత్తుగా వారిపై దాడి చేసింది. దారిన వెళ్లేవారిని కూడా ఈ వ్యక్తులు వదిలిపెట్టలేదు. రోడ్డుపై వెళుతున్న వాహనాలపై దాడికి తెగబడ్డారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బారాముండా ప్రాంతంలో జరిగిన దోపిడీ కేసులో ఈ దుండగుల గుంపు ప్రమేయం ఉందని అనుమానిస్తూ ఉన్నారు.