పబ్ లపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలోని పబ్ లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. రణ గొణ ధ్వనులతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న

Update: 2022-01-31 06:45 GMT

హైదరాబాద్ నగరంలోని పబ్ లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. రణ గొణ ధ్వనులతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పబ్ లపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై ఆంక్షలు పెట్టింది. పబ్ ల కారణంగా ఎవరికైనా ఇబ్బంది (సౌండ్ పొల్యూషన్) కలిగితే ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపింది. నగరంలోని ఆయా పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించే దిశగా జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ,పోలీసులు సూచనలు చేసింది.

పబ్ ల నుంచి వచ్చే సౌండ్స్ వల్ల ఇబ్బందులు కలిగితే.. ఫిర్యాదుదారులు నేరుగా 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులకు తెలిపింది ఎక్సైజ్ శాఖ. కొన్ని పబ్ లు ఎక్కువ వాల్యూమ్‌ లతో నడుస్తున్నాయన్న సమాచారం మేరకు నగరంలో ఉన్న పబ్‌లలో నో డీ జే & నో లైవ్ బ్యాండ్‌ ఆదేశాలు జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు.




Tags:    

Similar News