హోంగార్డు రవీందర్ రెడ్డి మృతి
హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్
హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి చెందారు. కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమత్తం మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రవీందర్ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జీతాలు రావడం లేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు రవీందర్. జీతాలు రావడంలేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. జీతాలు రావడంలేదని అడగడానికి వెళితే ఉన్నతాధికారులు అవమానించినట్లు వ్యాఖ్యలు చేయడంతో తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని హోంగార్డు అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నారు. రవీందర్ మృతికి పలువురు సంతాపం చెబుతున్నారు.