వైద్య విద్య కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు
వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి కిర్గిజ్‌స్థాన్ లో ఒక తెలుగు విద్యార్థి మరణించిన ఘటన జరిగింది
వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి కిర్గిజ్‌స్థాన్ లో ఒక తెలుగు విద్యార్థి మరణించిన ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన విద్యార్థి దాసరి చందు వైద్య విద్యను చదివేందుకు కిర్గిజ్‌స్థాన్ కు వెళ్లాడు. చందు తండ్రి మాడుగులలో హల్వా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భీమరాజు రెండో కుమారుడు చందు. పరీక్షలు రాసిన చందు తన సహచర విద్యార్థులతో కలసి మంచు జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు.
మంచులో కూరుకుపోయి...
అక్కడ ఏపీకి చెందిన మరో ఐదుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే వీరిలో చందు మంచులో కూరుకుపోవడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని ఏపీ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో మాడుగులలో విషాదం నెలకొంది.