తల్లి నిద్రపోతుందనుకుని రోజూ స్కూల్ కి వెళ్లొస్తున్న కొడుకు.. తీరా చూస్తే ?

రాజ్యలక్ష్మి ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. ఈనెల 8న రాజ్యలక్ష్మి ఇంట్లో పనిచేస్తూ.. కిందపడి

Update: 2022-03-12 05:15 GMT

తిరుపతి : తల్లి చనిపోయిందని గ్రహించలేని కొడుకు.. ఆమె నిద్రపోతుందనుకుని లేపడం ఇష్టం లేక రోజూ స్కూల్ కి వెళ్లొస్తున్నాడు. నాలుగు రోజులుగా ఇదే జరుగుతోంది. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో.. ఇరుగు పొరుగు వారి ద్వారా అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని విద్యానగర్ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి భర్తతో విభేదాల కారణంగా 10 ఏళ్ల కొడుకు శ్యామ్ కిషోర్ తో విడిగా ఉంటోంది.

రాజ్యలక్ష్మి ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. ఈనెల 8న రాజ్యలక్ష్మి ఇంట్లో పనిచేస్తూ.. కిందపడి మరణించింది. తల్లి చనిపోయిందని తెలుసుకోలేకపోయాడు శ్యామ్ కిషోర్. ఆమె నిద్రపోతుందనుకున్నాడు. లేపడం ఇష్టం లేక నాలుగు రోజులుగా ఇంట్లో ఉన్న ఆహారం తింటూ.. స్కూలుకెళ్లి వస్తున్నాడు. మంచం పక్కన ఉన్న తల్లి మృతదేహం పక్కనే పడుకునేవాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు శ్యామ్ మేనమామ దుర్గాప్రసాద్ కు సమాచారం ఇచ్చారు.
దుర్గా ప్రసాద్ ఇంటికొచ్చి చూసేసరికి సోదరి రాజ్యలక్ష్మి మరణించి ఉంది. సోదరి మృతదేహాన్ని చూసిన దుర్గాప్రసాద్ నిర్ఘాంతపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. కాగా.. శ్యామ్ మానసిక స్థితి సరిగా లేదని మేనమామ దుర్గాప్రసాద్ తెలిపారు.


Tags:    

Similar News