ఉత్తరాఖండ్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు.. కర్ఫ్యూ కూడా కారణమేంటంటే?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బన్‌భూల్‌ఫురలో టెన్షన్ నెలకొంది.పోలీసులకు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మరణించారు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బన్‌భూల్‌ఫురలో టెన్షన్ నెలకొంది. కొన్ని ప్రార్థనాలయాల కూల్చివేత సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మరణించారు. వంద మంది పోలీసులకు గాయాలయ్యాయి. పెద్దయెత్తున హింస చెలరేగడంతో బన్‌భూల్‌ఫురలో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర బలగాలతో పాటు ఉత్తరాఖండ్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
కర్ఫ్యూ ప్రకటించినా...
ఎప్పుడు అల్లరి మూకలు విరుచుకుపడతాయోనన్న టెన్షన్ నెలకొంది. ప్రార్థన మందిరాన్ని కూల్చివేస్తుండగా మున్సిపల్ అధికారులపై ఒకవర్గం వారు దాడి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారు. దీంతో ఆందోళన కారులు పోలీసులపై రాళ్లురువ్వడంతో వంద మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసు అధికారి తెలిపారు.