ఢీకొన్న రెండు రైళ్లు : 26 మంది మృతి
గ్రీస్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని 26 మంది చనిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది
గ్రీస్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఢీకొని 26 మంది చనిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నిన్న అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించగా, 85 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గ్రీస్ లోని టెంపే చోటుచేసుకున్న ఈ ఘటనలో రెండు రైళ్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టడంతో మూడు కోచ్ లు తగులపడిపోయాయి.
బలంగా ఢీకొట్టడంతో...
రెండు రైళ్లు బలంగా ఢీకొట్టడంతో నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు కోచ్‌లకు దాదాపు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్యాసెంజర్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 250 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రప్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.