ఘోర అగ్నిప్రమాదం : 17 మంది మృతి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 17 మంది కార్మికులు మృతి చెందారు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 17 మంది కార్మికులు మృతి చెందారు. తొలుత పన్నెండు మంది సజీవదహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు మరణించారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం పనిచేస్తూ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది.
ఆయిల్ డిపోలో...
ఇండోనేషియా ఇంధన అవసరాలకు 25 శాతం వరకూ ఈ డిపో నుంచి సరఫరా అవుతుంది. శుక్రవారం భారీ వర్షంతో పాటు పిడుగులు కూడా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని తర్వాత వరస పేలుళ్లు సంభవించడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధకిారులు తెలిపారు.