ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురి మృతి

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Update: 2023-02-19 02:43 GMT

tirupati road accident

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు టైర్ పంక్చరయి డివైడర్ ను ఢీకొట్టింది. మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. టైర్ పంక్చర్ అయిన కారు డివైడర్ ను ఢీకొని ఎగిరి అవతలి వైపు పడిపోయింది.

లారీ ఢీకొట్టడంతో...
అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు. టీఎస్ 07 జీడీ 3249 నెంబరు గల కారు ప్రమాదానికి గురయింది. మృతుల్లో నలుగుు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News