Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు;
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. కారు, ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముజఫర్ నగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులంతా ఢిల్లీకి చెందిన...
మృతులంతా ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. ఢిల్లీలోని షహదారాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారాణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతి వేగం, మంచు కారణమని ప్రాధమికంగా భావిస్తున్నారు.