మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ చోరీ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన నివాసంలో దోపీడీకి పాల్పడ్డారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన నివాసంలో దోపీడీకి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుకు ఉంగుటూరు మండలం ఆమదాలపల్లిలో సొంత నివాసం ఉంది. ఇక్కడ ఆయన బంధువులు మాత్రమే నివాసముంటున్నారు.
లక్షన్నర నగదు...
అయితే నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దొంగలు పడి లక్షన్నర నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.