రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా జేసీబీతో ఏటీఎంను పెకలించి..
మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోయారు. సాంగ్లీలో ఏటీఎంను చోరీ చేశారు. మామూలుగా చోరీ జరిగితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.
దొంగలు కూడా తెలివి మీరుతున్నారు. మామూలుగా దొంగతనం చేసే రోజులు పోయాయి. ఇది వరకూ ఏటీఎం ను పగలగొట్టో, కట్ చేసో సొత్తు దోచుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఏకంగా జేసీబీతో ఏటీఎంను పెకలించి ఎత్తుకుపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో దొంగలు రెచ్చిపోయారు. సాంగ్లీలో ఏటీఎంను చోరీ చేశారు. మామూలుగా చోరీ జరిగితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ జేసీబీతో ఏటీఎంను పెకలించి తీసుకెళ్లడంతో.. ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఏటీఎం ను జేసీబీతో పెకలించి, దానిని జేసీబీలోనే వేసుకుని ఎత్తుకెళ్లారు చోరులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్. సోషల్ మీడియాలో అయితే.. నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. జేసీబీలతో నిర్మాణాలను కూల్చడమే కాదు.. దొంగతనాలు కూడా చేయొచ్చంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. మరి పోలీసులు ఈ కేసును ఎలా చేధిస్తారో చూడాలి.