షిర్డీ ఎక్స్‌ప్రెస్ లో దొంగల బీభత్సం
షిర్డి - కాకినాడ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు పడ్డారు. పర్భని వద్ద ఈ ఘటన జరిగింది.
రైళ్లను కూడా దోపిడీ దొంగలు వదిలిపెట్టడం లేదు. బంగారాన్ని దోచుకు వెళుతున్నారు. తాజాగా షిర్డి - కాకినాడ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు పడ్డారు. పర్భని వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా రైలులోకి దొంగలు ప్రవేశించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు ముప్ఫయి మంది మెడలో నుంచి బంగారాన్ని దోచుకుని వెళ్లారు.
మహిళలనే టార్గెట్ గా...
మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్ శివారులో సిగ్నల్ కోసం షిర్డి - కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. ఇదే అదనుగా భావించిన దోపిడీ దొంగలు వెంటనే ఎస్ 2 బోగి నుంచి ఎస్ 11 బోగీ వరకూ మహిళల మెడలో బంగారాన్ని దోచుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని దోచుకుని వెళ్లారని తెలిసింది. బాధితులు అరిచేందుకు ప్రయత్నించగా వారిని బెదిరించి మరీ దోచుకు వెళ్లారు. దీనిపై మహిళలు పర్భణి రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.