జెరూసలెంలో వరస పేలుళ్లు

ఈరోజు ఉదయం ఇజ్రాయిల్ లోని జెరూసలెంలోని బస్టాప్ లలో పేలుళ్లు జరిగాయి.

Update: 2022-11-23 07:58 GMT

ఇజ్రాయిల్ లో వరస బాంబు పేలుళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. జెరూసలెంలోని రెండు బస్టాప్ లలో వరసగా బాంబు పేలుళ్లు జరిగాయి. బస్టాప్ లను లక్ష్యంగా చేసుకుని దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారని సమాచారం. ఈరోజు ఉదయం ఇజ్రాయిల్ లోని జెరూసలెంలోని బస్టాప్ లలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించారని తెలిసింది. దాదాపు పథ్నాలుగు మంది గాయపడ్డారని చెబుతున్నారు.


ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం....

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మొదట పేలుడు వీట్జ్‌మాన్ బౌలెవార్డ్ లో, రెండో పేలుడు రామోట్ లో జరిగింది. జెరూసలెం ప్రవేశానికి సమీపంలోని బస్టాప్ లలోనే ఈ పేలుళ్లు జరిగాయి. రెండు ప్రాంతాల్లోనూ సైకిళ్లలో బాంబులు పేర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్ధాలు ఉండే అవకాశముందని భావించి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశాయి.


Tags:    

Similar News