డేంజర్లో ఉన్నాం.. రక్షించండి.. ఆ ముగ్గురు యువతులు ఎలా చనిపోయారు ?

ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన యువతులు తాము ప్రమాదంలో ఉన్నామని, రక్షించాలంటూ సన్నిహితులకు..

Update: 2023-04-19 06:39 GMT

ecuador beach murders mystery

బీచ్ లో సరదాగా గడపాలని వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురైన ఘటన దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ లోని క్వినెడే సమీపంలోని బీచ్ లో వెలుగుచూసింది. ఏప్రిల్ 4న జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. చనిపోడానికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో వాళ్లు పెట్టిన మెసేజ్‌లు ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, రక్షించాలంటూ సోషల్ మీడియాలో స్నేహితులకు మెసేజ్ లు పంపిన కొద్దిసేపటికే అగంతకులు ముగ్గురు యువతులను చిత్రహింసలు చేసి, గొంతుకోసి అర్థనగ్నంగా బీచ్ ఒడ్డున పాతిపెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. డెన్నిసి రేనా (19), యులియానా మాసియస్ (21), నయేలి తాపియా(22) అనే ముగ్గురు యువతులు సరదాగా గడిపేందుకు ఏప్రిల్4న ఈక్వెడార్‌లోని ఓబీచ్‌కు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ.. బీచ్‌ ఒడ్డున కొందరు దుండగులు ముగ్గురు యువతులను వెంబడించి చాలా దూరం తరిమారు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన యువతులు తాము ప్రమాదంలో ఉన్నామని, రక్షించాలంటూ సన్నిహితులకు మెసేజ్ లు పంపారు. నయేలి తన సోదరుడికి రాత్రి 11:10 గంటలకు వాట్సప్ మెసేజ్ పంపింది. ఐతే సోదరుడు వెంటనే ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు ‘నాకేదో ప్రమాదం జరగబోతుంది.. ఒకవేళ నాకేదైనా జరిగితే, గుర్తుంచుకో ఐ లవ్‌ యూ వెరీ మచ్‌’ అని మెసేజ్ పంపింది.
ఏప్రిల్ 5న చేపలవేటకు వెళ్లిన జాలర్ల కుక్క.. బీచ్ లో ఓ ప్రాంతంలో కాళ్లతో తవ్వుతుండటంతో జాలర్లు అక్కడ ఏముందా అని చూడగా.. కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్కడ ముగ్గురు యువతుల శవాలు అర్థనగ్నంగా కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతులను ఎవరు హత్య చేశారన్నది తెలుసుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతుల్లో ఒకరైన నయేలికి వివాహమై ఓ బిడ్డకు తల్లి. ఆమె ఫేమస్‌ సింగర్‌ కూడా.





Tags:    

Similar News