ఎదురు కాల్పులు ముగ్గురు జవాన్ల మృతి

ఛత్తీస్‌గడ్ లోని టేకులగూడెంలో జరిగిన మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు;

Update: 2024-01-30 13:50 GMT
ఎదురు కాల్పులు ముగ్గురు జవాన్ల మృతి
  • whatsapp icon

ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని టేకులగూడెంలో జరిగిన మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. పధ్నాలుగు మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న జవాన్లను హెలికాప్టర్లలో చికిత్స అందించేందుకు తరలించారు. ఉదయం నుంచి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

గాలింపు కొనసాగుతుండగా...
మావోయిస్టులున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఒక్కసారిగా మావోయిస్టులు విరుచుకుపడి జవాన్లపై కాల్పులు ప్రారంభించినట్లు అక్కడ ఉన్న అధికారులు తెలిపారు. దీంతో భద్రతాదళాలు కూడా ఎదురు కాల్పులు జరిపామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో మరోసారి ఛత్తీస్‌గడ్ లోని అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. గాయపడిన జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.


Tags:    

Similar News